సాహితీ కిరణం కథలు, కవితల పోటీ
'సాహితీ కిరణం' మాసపత్రిక తృతీయ వార్షికోత్సవం సందర్భంగా కార్తీకా డెవలపర్స్ సౌజన్యంతో కథల పోటీ, డాక్టర్ పట్టాభి కళాపీఠం సౌజన్యంతో కవితల పోటీ నిర్వహిస్తోంది. కథల పోటీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా రూ.1800, రూ.1200, రూ.750 ఉంటాయి. మరో ప్రోత్సాహిక బహుమతులు (రూ.250 చొప్పున) ఉంటాయి. కవితల పోటీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరసగా రూ.1500, రూ.1000, రూ.500 ఉంటాయి. ఐదు ప్రోత్సాహక బహుమతులు (ఒక్కోటి రూ.200 చొప్పున) ఉంటాయి. కథలు a4 పేపరుపై చేతి రాతలో ఆరు పేజీలు, డిటిపిలో మూడు పేజీలు మించకూడదు. కవిత 20 లైన్లకు తగ్గకుండా, 25 లైన్లు మించకుండా ఉండాలి. రచనలు 30.4.1012లోగా దిగువ చిరునామాకు పంపాలి. ఇతర వివరాలకు సెల్ 9490751681ని సంప్రదించవచ్చు.
సాహితీ కిరణం
ఇంటి నెం. 11-13-154, అలకాపురి,
రోడ్ నెం.3, హైదరాబాద్ - 5000035
No comments:
Post a Comment