"తెలుగుబిడ్డ నీవు తెలుగుగడ్డ నీది! తెలతెలవారే వచ్చే వెలుగంటి భాష నీది! చిలకపలుకు చందాన పనికిరానిచదువులేల? మేధను పెంపొందింపక కాగితాలు నింపనేల? మన భాషపై వైముఖ్యం పరభాషపై మోహమిది. ఆదిలోనే తుంచివేసె ఆలోచనా శక్తినిది!"
No comments:
Post a Comment